ఉమ్మడి మెదక్ జిల్లాపై చలి పంజా విసురుతుంది. చలికి జనం గజగజ వణుకుతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కి పడిపోయాయి. రాష్ట్రంలోనే కనిష్ట ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకు గ్రామల నుంచి పట్టణాల వరకు అన్ని చోట్ల రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పూట పొగమంచు కారణంగా రోడ్లపై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వెళ్లే వారికే కాకుండా విమానాల రాకపోకలకు సైతం ఇబ్బంది నెలకొంది. తాజాగా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఈ రోజు ఉదయం ఎయిర్‌ఇండియా సంస్థకు చెందిన ఓ విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే ల్యాండింగ్ సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ రన్‌పై…