Defence Forces In KBC 17: కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 17కి హోస్ట్‌గా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మళ్లీ వ్యవహరిస్తున్నారు. అయితే, త్వరలో ప్రసారం కానున్న స్వాతంత్య్ర దినోత్సవ రోజుకు సంబంధించి ప్రత్యేక ఎపిసోడ్ ప్రోమోలో ఆయన దేశ రక్షక వీరులైన భారత రక్షణ దళాల ప్రతినిధులతో కలిసి ముచ్చటించారు.
Vikram Misri: గత రాత్రి భారత నగరాలపై, పౌరులపై పాకిస్తాన్ ఉద్దేశపూర్వక దాడులు జరిపింది అని భారత విదేశీ వ్యవహరాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. భారత్ ఉద్రిక్తతను పెంచకుండా, బాధ్యతాయుతంగా ఈ దాడులకు తగిన సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు.
'ఆపరేషన్ సిందూర్'తో నిరాశ చెందిన పాకిస్థాన్.. భారతదేశంలోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. ఈ అంశంపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సమాచారం ఇచ్చారు. గత 24 గంటల్లో పాకిస్థాన్ సైన్యం భారతదేశాన్ని ఎలా లక్ష్యంగా చేసుకుందో వివరించారు. వారి ఎత్తుగడలు ఏవీ విజయవంతం కాలేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం..