Wife Kills Husband: భార్య పుట్టిన రోజు వివాదం భర్తకు చావుగా మారింది. తన పుట్టిన రోజు వేడుకల కోసం దుబాయ్‌కి తీసుకెళ్లలేదని భార్య, భర్తను కొట్టి చంపింది. ఈ ఘటన పూణేలో చోటు చేసుకుంది. దుబాయ్ తీసుకెళ్లేందుకు నిరాకరించడంతో భార్య, భర్త ముక్కుపై కొట్టింది. దీంతో 36 ఏళ్ల వ్యక్తి మరణించాడు. పూణేలోని వానావ్డీ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియన్ సొసైటీలో శుక్రవారం ఈ దారుణం జరిగింది.