అమెరికా మరోసారి భారత్ ను మెచ్చుకుంది. భారత్ లో సార్వత్రికి ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని కొనియాడింది. ఆ దేశ వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్‌ను ప్రశంసించారు.
భారత సంతతికి చెందిన ఓ కుర్రాడు అమెరికాలో దారుణానికి ఒడిగట్టాడు. నాజీ సర్కారు తీసుకొచ్చేందుకు బైడెన్ కూడా చంపాలనుకున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. అతడు గతేడాది అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద ట్రక్కు తో దాడి చేసిన ఘటన తెలిసిందే.
కాలేజీ క్యాంపస్ లలో యూదుల వ్యతిరేక నిరసనలు కొనసాగుతుండటాన్ని అమెరికా శ్వేత సౌధం తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి అమెరికన్ కు ఉంది.
పాకిస్థాన్ కు వ్యతిరేకంగా అమెరికాలోని వైట్ హౌస్ ముందు బలూచిస్థాన్ వలసదారులు ఆందోళనకు దిగారు. గత 75 ఏళ్లలో బలూచిస్థాన్‌లో జరిగిన అకృత్యాలకు వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని బలూచిస్థాన్ అసెంబ్లీ మాజీ స్పీకర్ వహీద్ బలోచ్ నిరసన వ్యక్తం చేశారు.
North Korea: నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కి అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా లేదా దాని మిత్ర రాజ్యాలపై అణుదాడి జరిగితే అది ఆమోదయోగ్యం కాదని, ఈ పరిణామాలు కిమ్ పాలనకు ముగింపు పలుకుతాయని అమెరికా-దక్షిణ కొరియా ఒక సంయుక్త ప్రకటనలో శనివారం తెలిపాయి.
North Korea: ఉత్తర కొరియా తొలిసారిగా తన సైనిక నిఘా శాటిలైట్‌ని విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా అభ్యంతరాలను పెడచెవిన పెట్టి, కిమ్ జోంగ్ ఉన్ శాటిలైట్ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర కొరియా నిర్వహించ స్పై శాటిలైట్ ప్రయోగం విఫలమైంది. ఆ తర్వాత ఇటీవల నిర్వహించిన ప్రయోగం విజయవంతమైంది.
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ కుట్ర చేసిందని అమెరికా అధికారి ఆరోపించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నిన్న కథనాన్ని ప్రచురించింది. అయితే అమెరికా ఈ హత్య ప్రయత్నాన్ని భగ్నం చేసినట్లు తన కథనంలో పేర్కొంది. అయితే పన్నూను హత్య చేసే కుట్రలో ప్రమేయం ఉందని తెలియగానే భారత్ ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేసినట్లు వైట్‌హౌజ్ ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ అన్నారు. అయితే వాట్సన్ వ్యాఖ్యల్ని…
White House: అమెరికా అధ్యక్ష భవనంలో వైట్‌హౌజ్‌లో అనుమానాస్పదంగా వైట్ పౌడర్ వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఆదివారం సాయంత్రం వైట్ హౌస్ వద్ద అనుమానాస్పద పదార్థాన్ని కనుగొంది.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వైట్‌హౌస్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జిల్ బిడెన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. వైట్‌హౌస్‌లో నాకు లభించిన గౌరవం 140 కోట్ల మంది భారత ప్రజల గౌరవమని ఆయన అన్నారు.