H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న H-1B వీసా చర్యలు భారతీయుల్లో కల్లోలం నింపుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత తమ తల్లిదండ్రుల్ని, కుటుంబాలను కలవడానికి వచ్చిన వారు, పెళ్లి చేసుకునేందుకు వచ్చిన వారు అయోమయ స్థిలో పడ్డారు. తమ వివాహాలను రద్దు చేసుకుని, మళ్లీ అమెరికా ఫ్లైట్ ఎక్కుతున్నారు. హెచ్1బీ వీసాల రుసుము 1,00,000 డాలర్లు(రూ. 88 లక్షలు)కు పెంచుతూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం పెట్టాడు.