Voyager: వయోజర్ 1, వయోజన్ 2.. ఈ రెండు స్పేస్ ప్రోబ్స్ ఇప్పటి వరకు మానవుడి ద్వారా నిర్మించబడి విశ్వంలో అత్యంత దూరం ప్రయాణించిన అంతరిక్ష వస్తువులుగా రికార్డు సృష్టించాయి. సౌర వ్యవస్థను ఎప్పుడో దాటవేసిన ఇవి, ప్రస్తుతం ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లో ప్రయాణిస్తున్నాయి. సూర్యుడి రక్షణ బుడగను, ఆవల ఉన్న అంతరిక్ష ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నాయి. అయితే, వయోజర్ ప్రోబ్స్‌లో రెండు పరికరాలను నాసా నిలిపేయనుంది. దీని ద్వారా వాటిలో ఉన్న విద్యుత్‌ని ఆదా చేయాలని చూస్తోంది.