భారత్ గోధుమల ఎగుమతులను బ్యాన్ చేసింది. దేశీయంగా ధరలు పెరడటంతో ధరలను కంట్రోల్ చేసే ఉద్దేశంతో విదేశాలకు గోధమ ఎగుమతులను నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( డిజిఎఫ్టీ) శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. ఇండియాలో ఆహర భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఎగుమతులు చేయడానికి మాత్రం అనుమతులు ఇచ్చింది. కాగా ఇప్పుడు ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచాన్ని భయపెడుతున్నట్లు…