మనిషి ఏ నొప్పినైనా భరించగలడు గానీ ఆకలి బాధను భరించలేడు. ఉదయం కొంచెం లేటుగా టిఫిన్ చేస్తేనే నీరస పడిపోతారు. స్పృహ తప్పి పడిపోతారు. అలాంటిది కొద్ది నెలలుగా గాజా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక చిన్న పిల్లలు, వృద్ధులు తిండి లేక నీరసించిపోతున్నారు. దీంతో చాలా మంది ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కూడా వదలుతున్నారు. తాజాగా ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.