బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ స్పష్టం చేశారు. సినీ నటులు, టీవీ యాంకర్లు ఇలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించిన వెంటనే వారిపై విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 11 మంది బెట్టింగ్ యాప్స్‌ను ప్రోత్సహించిన వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వెల్లడించారు.