ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన ఓ దివ్యాంగ బాలుడు నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి క్షేమంగా బయటపడ్డాడు. బోరుబావిలో పడ్డ 12 ఏళ్ల బాలుడు రాహుల్ సాహు కోసం ఛత్తీస్గఢ్లోని జాంజ్‌గిర్ చంపాలో నిర్వహించిన ఆపరేషన్ పూర్తయ్యింది. దాదాపు 104 గంటల పాటు శ్రమించి.. ఆర్మీ, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రాహుల్ సాహును బోరుబావి నుంచి బయటికి తీసి.. ప్రత్యేక అంబులెన్స్‌లో బిలాస్‌పూర్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఐసీయూలో రాహుల్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.…
జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈతకు వెళ్ళి నదుల్లో, బావుల్లో ప్రమాదాలకు గురై కన్నవారికి కడుపుకోత, అయినవారికి కన్నీళ్ళు మిగులుస్తున్నారు. జనగామ జిల్లా యశ్వంత్ పూర్ లోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థి మరణించడం విషాదం నింపింది. మృతుడు జనగామ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల గోడదూకి దొంగతనంగా యశ్వంత్ పూర్ రైల్వే…
నదిలో పడ్డ వ్యక్తిని కాపాడిన పోలీస్.. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించిన పోలీసులు.. ఇలాంటి వార్తలు మనం తరచూ చూస్తుంటాం. కోవిడ్ టైంలో అయితే ఎంతోమంది పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేసి ప్రజల్ని రక్షించారు. ఆపదలో ఎవరు వున్నా.. విధి నిర్వహణలో వున్న పోలీసులు తమ ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతుంటారు. ఫ్రెండ్లీ పోలీసులు అనిపించుకుంటూ వుంటారు. గుంటూరు పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. https://ntvtelugu.com/tamilnadu-former-built-a-temple-for-his-pet-dog/ ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్ధురాలి ప్రాణాలు కాపాడారు అరండల్ పేట…
సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. అందులో ఉన్న వారితో పాటు…వారిని రక్షించేందుకు…బావిలోకి దిగిన గజ ఈతగాడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. శాయశక్తుల కష్టపడి.. బావిలో పడిన కారును బయటకు తీసే క్రమంలో అందులోనే చిక్కుకుపోయాడు. ఆరు గంటలు శ్రమించి… చివరకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన గజ ఈతగాళ్లు.. క్రేన్ సాయంతో కారును బయటకు తీయగా.. అందులో తల్లీకొడుకుల మృతదేహాలు బయటపడ్డాయి. మెదక్…