Today Business Headlines 05-05-23: చైనాకి.. మంత్రి కేటీఆర్: తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. వచ్చే నెలలో చైనా వెళ్లనున్నారు. జూన్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ దేశంలోని టియాంజిన్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందింది.