ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బరేలీలోని నవాబ్‌గంజ్‌లో ఓ యువకుడి పెళ్లి విందులో చపాతీల విషయంలో ఘర్షణ తలెత్తింది. అయితే.. కొందరు యువకులు వేడి వేడి చపాతీలు తమకు అందలేదని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో.. తమకు చపాతీలు ఇవ్వలేదని నానా హంగామా సృష్టించారు. ఈ క్రమంలో.. యువకులకు, వరుడి కుటుంబీకుల మధ్య గొడవ జరిగింది. దీంతో.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. కాగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.