Divorce Case: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో కొత్తగా పెళ్లయిన ఒక మహిళ, మూడు రోజులకే విడాకుల కోసం అప్లై చేసుకుంది. పెళ్లి రాత్రి తన భర్త శారీరకంగా అసమర్థుడని ఒప్పుకున్నాడని ఆమె ఆరోపించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. తర్వాత వచ్చిన వైద్య నివేదికలో వరుడు ‘‘తండ్రి కాలేదు’’ అని నిర్ధారణ అయిందని వధువు కుటుంబం పేర్కొంది. పెళ్లికి అయిన ఖర్చులు, బహుమతులు తమకు తిరిగి ఇవ్వాలని పెళ్లికూతురు కుటుంబం డిమాండ్ చేస్తోంది.