ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు వివిధ కంపెనీలు అమ్మకాలను పెంచుకోవడానికి అనేక ఆఫర్‌లను ప్రకటించడం మనందరికీ తెలిసిందే. పండుగ సందర్భంగా కొన్ని కంపెనీలు 50% – 80% వరకు తగ్గింపును అందిస్తాయి. కానీ మెక్సికోకు చెందిన ఒక కస్టమర్ వేల డాలర్ల విలువైన ఆర్డర్లు కేవలం కొన్ని పదుల డాల్లర్స్ కే కొంటానని కలలో కూడా ఊహించలేదు. అదే సమయంలో చిన్న పొరపాటుకు కంపెనీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. Also Read: AC For Buffaloes :…
అయోధ్య రామమందిర ప్రసాదాన్ని అందజేస్తామని చెబుతున్న వెబ్‌సైట్‌ను అన్ని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ వెబ్‌సైట్ ప్రజల విశ్వాసం, వారి మనోభావాల ముసుగులో మోసం చేస్తోందని, అది కూడా ఖాదీ పేరును ఉపయోగిస్తోందని జస్టిస్ సంజీవ్ నరులా ధర్మాసనం పేర్కొంది. వెబ్‌సైట్ యజమానులు సాధారణ ప్రజలను మోసం చేశారని, తీసుకున్న డబ్బుకు రసీదు లేదా ప్రసాదం చేరినట్లు ఎటువంటి రుజువు ఇవ్వలేదని కోర్టు పేర్కొంది.
Artificial Intelligence : టెక్నాలజీ ప్రతి ఏడాది అభివృద్ది చెందుతూనే ఉంది. టెక్నాలజీ అనేది మానవ జీవితంలో నిత్యవసరంగా మారిపోయింది. అది ఫోన్ వాడకం కావచ్చు.. ల్యాప్‌టాప్ కావొచ్చు.. ఇతర టెక్నికల్ వస్తువులు కావొచ్చు.
పాకిస్థాన్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్ విడ్లీ టీవీ వెబ్‌సైట్, యాప్‌లు, సోషల్ మీడియా ఖాతాలను భారత్ బ్లాక్ చేస్తుంది.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఇటీవల ఒక సిరీస్‌ను విడుదల చేసింది – “సేవక్: ది కన్ఫెషన్స్”, ఇది జాతీయ భద్రత, రక్షణ మరియు విదేశీ రాష్ట్రాలతో భారతదేశం యొక్క స్నేహపూర్వక సంబంధాలకు హాని కలిగిస్తోందని కేంద్రం గుర్తించింది.. దీంతో, ఓటీటీ ప్లాట్‌ఫారమ్ విడ్లీ టీవీకి చెందిన ఒక వెబ్‌సైట్, రెండు మొబైల్ అప్లికేషన్‌లు, నాలుగు సోషల్ మీడియా ఖాతాలు…
TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 16న నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 503 గ్రూప్ 1 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆనందయ్య మందు పంపిణీ చాలా గందరగోళంగా తయారైంది. Childeal.com ద్వారా ఆనందయ్య ఆయుర్వేదం మందును పంపిణీ చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అలాంటి అధికారిక వెబ్‌సైట్ ఏదీ లేదని తేల్చిచెప్పింది ఫ్యాక్ట్ చెక్ టీమ్. ఇప్పటి వరకు ఏ వెబ్‌సైట్‌కు అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది. ఒకవేళ అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే ప్రభుత్వమే అధికారికంగా వెల్లడిస్తుందని…
ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మళ్లీ మందు పంపిణీ ఏర్పాట్లలో మునిగిపోయారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. అయితే, మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దు అని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు… జిల్లాకు 5 వేల చొప్పున మందులు పంపుతామని.. అధికారులు వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. మరి ఆనందయ్య మందు పంపిణీ ఎప్పటి నుంచి అని అంతా ఎదురుచూస్తోన్న సమయంలో.. సోమవారం నుండి అందుబాటులోకి…