Amazon: సాంకేతిక రంగంలో అగ్రగామి అమెజాన్ మరోసారి పెద్ద సంచలనం సృష్టించింది. రోజంతా వినిపించే మాటలను నోట్‌లుగా మార్చే ప్రత్యేక వెయిరబుల్ పరికరాన్ని తయారు చేసిన Bee AI స్టార్టప్‌ను అమెజాన్ కొనుగోలు చేసింది. సాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ రూపొందించిన Bee Pioneer అనే గ్యాడ్జెట్ ఇప్పటికే వినియోగదారుల్లో మంచి హడావుడి సృష్టించింది. $49.99 (సుమారు రూ. 4,000) ధరలో లభ్యమయ్యే ఈ పరికరం రోజువారీ సంభాషణలను రికార్డ్ చేసి, సారాంశాలు తయారు చేస్తుంది.…