ఇటీవల కాలంలో సజ్జనార్ పుణ్యమాని టీఎస్ ఆర్టీసీకి ఫ్రీగానే కావాల్సినంత ప్రమోషన్లు జరుగుతున్నాయి. సజ్జనార్ “రాధేశ్యామ్”, “ఆర్ఆర్ఆర్” సినిమాల పట్ల ప్రేక్షకులను ఉన్న మేనియాను టీఎస్ ఆర్టీసీ బస్సు ప్రయాణం గురించి ప్రేక్షకుల్లో అవగాహన కల్పించడానికి ఉపయోగిస్తున్నారు. పలు సినిమా మీమ్స్ తో టీఎస్ ఆర్టీసీ గురించి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా, అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించారు. తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా అదే బాటలో నడుస్తూ “కేజీఎఫ్ 2” పవర్ ఫుల్ డైలాగ్ ను వాడేశారు.…