ఆసియా కప్ 2025ఓ భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా భారత్, యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియాను ఉత్సాహపరిచేందుకు అభిమానులు పెద్దగా స్టేడియంకు రాకపోయినా.. ఒకరు మాత్రం మైదానంలో సందడి చేశారు. భారత జెండా పట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. టీమిండియాను ఉత్సాహపరుస్తూ కెమెరాల్లో కనిపించారు. దాంతో క్రికెట్ అభిమానులలో చర్చనీయాంశంగా మారారు. ఆమె అఫ్గానిస్థాన్‌కు చెందిన వజ్మా ఆయుబి. 28 ఏళ్ల వజ్మా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు వ్యాపారవేత్త కూడా. 2022 ఆసియా…