తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచినీటి కుళాయి కోసం తవ్విన గోతిలో పడి నాలుగున్నర ఏళ్లు బాలుడు శ్రీను మృతి చెందాడు. ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు అనంతలోకల్లా కలిసిపోవడంతో దివాన్ చెరువు గ్రామంలో విషాదం అలుముకుంది.
ఓవైపు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రజలకు మౌలికసదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా.. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ మంచినీటి కుళాయి ఏర్పాటుచేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇవాళ ఆర్‌డబ్ల్యూఎస్ టెక్నికల్ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులకు ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారా నీటి వసతి కల్పిస్తామన్నారు.. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి…