Resomation: చనిపోయిన తర్వాత భౌతికకాయానికి మత సంప్రదాయాలను అనుసరించి ఖననం, దహనం చేయడం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ పద్దతితో దహనసంస్కారాలు నిర్వహిస్తున్నారు. చాలా దేశాల్లో కూడా ఇదే తరహా దహనసంస్కారాలు అమలులో ఉన్నాయి. అయితే ‘నీటిలో అంత్యక్రియలు(Water Cremation)’ నిర్వహించే పద్ధతిని కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయి. రిసోమేషన్ అనే పిలువబడే ఈ ప్రక్రియ ఇప్పటికే కొన్ని దేశాల్లో అమలులో ఉంది. తాజాగా బ్రిటన్ కూడా ఈ తరహా పద్దతికి అనుమతి ఇచ్చింది. ఈ రిసోమేషన్(Resomation)…