Delhi High Court: రెస్టారెంట్ల సంఘాలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీల తీరును తప్పుబట్టింది. విక్రయించే వాటిపై ఎమ్మార్పీ కంటే ఎక్కువే తీసుకుంటున్నప్పుడు మళ్లీ అదనంగా సర్వీస్ ఛార్జీ ఎందుకు వసూలు చేస్తున్నారంటూ రెస్టారెంట్ల సంఘాలను నిలదీసింది. హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీ తప్పనిసరి కాదంటూ ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ జాతీయ రెస్టారెంట్ల సంఘం,…