నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల పాఠశాలలో వాచ్ మెన్ వెంకటేష్ అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడు అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్ల బావికి చెందిన వెంకటేష్ లింగాల గురుకుల పాఠశాలలో గత 13 సంవత్సరాల నుండి ఔట్ సోర్సింగ్ లో వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది క్రితం పాఠశాలకు వచ్చిన సూపరింటెండెంట్ సింగయ్య గత కొంత…