తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. హనుమకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కోర్టుల ఆధునీకరణతో ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు.. శిథిలావస్థలో ఉన్న కోర్టులను పునరుద్ధరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.. కోర్టుల్లో మౌలిక వసతులు ఉంటేనే పేదలకు న్యాయ సేవలు అందుతాయన్న ఆయన.. మౌలికవసతులు లేకుండా న్యాయమూర్తులు, న్యాయవాదులు పని చేయాలని అనుకోవడం దురాశ…