మామునూరు ఎయిర్ పోర్టుకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. ఈ రోజు నిర్వహించిన సమీక్షలో ఎయిర్ పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.