మామునూరు ఎయిర్ పోర్టుకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. ఈ రోజు నిర్వహించిన సమీక్షలో ఎయిర్ పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Ponnam Prabhakar : హనుమకొండ జిల్లాలో 3వ ఎడిషన్ క్రేడాయి వరంగల్ ప్రాపర్టీ షోను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. క్రేడాయి ప్రాపర్టీ షో మూడవ ఎడిషన్ వరంగల్ లో విజయవంతంగా నిర్వహిస్తున్న క్రేడాయి ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ తరువాత వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడు సిటీ లు కలిసి అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు మంత్రి పొన్నం. ఇటీవలే ఈ ప్రాంతంలో ఆరు వేల కోట్లతో ముఖ్యమంత్రి అభివృద్ది…
Rammohan Naidu : హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కృషి చేశారని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అన్నారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో 5 వేల ఎకరాల భూమిని సేకరించడం చిన్న విషయమేమీ కాదన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టును సాకారం చేసిన చంద్రబాబు నాయుడు దార్శనికత వల్లే గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల కాన్సెప్ట్ ఉద్భవించిందని ఆయన ఉద్ఘాటించారు. Andhra Pradesh: ఏపీలో 50 లక్షల…
వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్టుకు NOC సాధించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ప్రజల కళ నెరవేరబోతుందన్నారు. 8 నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామన్నారు. 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఎయిర్ పోర్టు కోసం ప్రభుత్వం కేటాయించిందని, డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి పౌర విమానయాన శాఖ మంత్రిని కలుస్తామన్నారు.
తెలంగాణలో మరొక ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది. ఖిలా వరంగల్ మండలంలోని మామునూరులో ఎయిర్ పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ నగర అభివృద్ధి కోసం కీలక ప్రకటన చేశారు. "విజన్-2025" పేరుతో మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా, వరంగల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పనులు యుద్ధ ప్రాతిపదికన త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
Warangal Airport: తెలంగాణలోని వరంగల్‌లో ప్రాంతీయ విమానాశ్రయం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక్కడ ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయం..