Waqf Act: కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం అమలుపై పాక్షికంగా లేదా పూర్తిగా స్టే విధించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకి తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం దాఖలు చేసిన పిటిషన్‌లో.. ఇలాంటి కేసుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చట్టబద్ధమైన నిబంధనల్ని నిలిపేసే అధికారం కోర్టులకు లేదని, చట్టంలో అలా లేదని ప్రభుత్వం వాదించింది. ‘‘పార్లమెంట్ చేసిన చట్టాలకు రాజ్యాంగబద్ధత ఉంది. మధ్యంతర స్టే అనేది అధికారాల సమతుల్యత సూత్రానికి విరుద్ధం’’ అని పేర్కొంది. ఉమ్మడి పార్లమెంటరీ…