భూమిపై నివసించిన అత్యంత బరువైన జంతువును ఒకదాన్ని పెరువియన్ ఎడారిలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది 340 టన్నుల బరువు ఉంటుందని తెలుపుతున్నారు. సముద్రంలో ఉండే నీలి తిమింగళం కంటే మూడు రెట్లు ఎక్కువ బరువును కలిగి ఉండాలి. అయితే శాస్త్రవేత్తలు కనుగొన్న జంతువు 39 మిలియన్ సంవత్సరాల కాలం నాటిదని చెబుతున్నారు. ఈ జంతువును పెరువియన్ ఎడారిలో లభించిన అవశేషాల ఆధారంగా గుర్తించారు.