వాల్టా చట్టం పై అధికారులతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ-సీఈడబ్ల్యుఎ నిబంధనల అమలు పై ప్రధానంగా చర్చించారు. ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను వినియోగించే పరిశ్రమలపై దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సీఈడబ్ల్యుఎ ప్రతిపాదనల్లో భాగంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న భూగర్భ జలాలపై ఛార్జీల విధింపును…