అసలే సినిమాల వైపు జనం పరుగులు తీయడం మానేశారని విశేషంగా వినిపిస్తోంది. అందుకు ఓటీటీ ఎఫెక్ట్ కారణమనీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మన భారతీయ సినిమాలకు హాలీవుడ్ కామిక్ మూవీస్ కూడా దెబ్బ కొడుతున్నాయని తెలుస్తోంది. అందుకు జూలై 7న విడుదలైన మార్వెల్ మూవీ ‘థోర్: లవ్ అండ్ థండర్’ తాజా ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ సినిమా మన దేశంలో మొదటివారానికి రూ. 78 కోట్లు పోగేసింది. నిజానికి ఇంతకు ముందు వచ్చిన కామిక్ బేస్డ్…