Waheeda Rehman honoured with Dadasaheb Phalke award: ప్రముఖ నటి వహీదా రెహమాన్‌కు అరుదైన గౌరవం లభించనుంది. వహీదా రెహమాన్‌ను ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు. వహీదాను దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకి ఎంపిక చేసినట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం తెలిపారు. సోషల్ మీడియాలో ఒక ట్వీట్‌ను షేర్ చేస్తూ ‘వహీదా రెహమాన్ జీ భారతీయ సినిమాకు ఆమె చేసిన విశిష్టమైన కృషికి…