గస్టు 23న రష్యాలో ఓ ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు. ఈ సమయంలో వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ కూడా ఈ విమానంలో ఉన్నారని తెలిసింది. యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారని కూడా తెలిసింది.
రష్యా రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ మరణం ఆశ్చర్యం కలిగించదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబాటు చేసిన క్షణమే, అతడికి మూడిందన్న వ్యాఖ్యలు వినిపించాయి.
ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నిరోజులు రష్యా తరపున పోరాడిన సైన్యమే ఇప్పుడు ఎదురు తిరిగింది. రష్యా సైనిక నాయకత్వమే లక్ష్యంగా వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చేస్తోంది. సాయుధ పోరాటానికి వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ పిలుపునిచ్చారు.