రామాయణం హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటిగా భావించే ఇతిహాసం. రాముడిని ఆదర్శపురుషుడిగా కొలుస్తారు. చిన్నప్పటి నుంచి వింటున్న రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, భరతుడు, దశరథుడు, కౌసల్య, శబరి ఇలా ఎన్నో పాత్రల గురించి తెలిసే ఉంటుంది. చాలా మందికి తెలియని మరోపాత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాముని చరిత్రకు సంబంధించి వాల్మీకి రామాయణాన్నే ప్రామాణికంగా భావిస్తారు. కానీ వాల్మీకి రామాయణంలో కనిపించని చాలా గాథలు ప్రచారంలో ఉన్నాయి. మనం తరచూ వినే ‘లక్ష్మణరేఖ’ వంటి…