Sundeep Kishan: కుర్ర హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా సందీప్ కు ఆశించనంత ఫలితం రాలేదు. దీంతో ఈసారి ఎలా అయినా మంచి విజయాన్ని అందుకోవాలని కసితో థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ నటిస్తున్న చిత్రం ఊరి పేరు భైరవకోన.