ఎన్నికల సంఘం SIR రెండవ దశను ప్రకటించింది. బీహార్ తరువాత, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పుడు 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభం కానుంది. వీటిలో అండమాన్, నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఓటర్లు SIR కోసం సమర్పించాల్సిన పత్రాల జాబితాను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. మీ వద్ద ఈ పత్రాలు ఉంటే, మీరు వాటిని మీ…
తాడేపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, పరిశీలకులు, జేసీఎస్ కోర్డినేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల గుర్తింపు, ఓటర్ల నమోదుపై వైసీపీ పార్టీ ఫోకస్ పెట్టిందని ఆయన తెలిపారు.
ఓటరుగా నమోదుపై యువతలో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని తొలగించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో ప్రవేశాలను ఓటు హక్కుతో ముడిపెట్టాలని నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వం 18 ఏళ్లు పైబడిన విద్యార్థులు కాలేజీల్లో అడ్మిషన్ పొందేందుకు తమ ఓటరు నమోదును తప్పనిసరి చేస్తుందని రాష్ట్ర మంత్రి ఒకరు తెలిపారు.