ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లపై…రెవెన్యూ అధికారుల దాడులు కొనసాగుతున్నాయ్. చిత్తూరు పలు థియేటర్లకు…అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అనంతపురం జిల్లా నాలుగు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. ఏపీలో నిబంధనలు పాటించని థియేటర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. చిత్తూరు జిల్లాలో 11 థియేటర్లను సీజ్ చేశారు. మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని 37 సినిమా హాళ్లకు నోటీసులు ఇచ్చారు. వీటిలో 16 సినిమా థియేటర్లు మూసివేశారు. మదనపల్లిలో ఏడు, కుప్పంలో నాలుగు…