వేసవి ఉక్కపోత కంటే ఎక్కువగా ఆ ఎమ్మెల్యేలు పొలిటికల్ సఫకేషన్ ఫీలవుతున్నారా? దానికైతే ఏసీ వేసుకుంటే సరిపోతుందిగానీ… దీనికేం చేయాలో అర్ధంకావడం లేదని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారా? ఆ ఫ్రస్ట్రేషన్‌లోనే చిటపటలాడి పోతున్నారా..? ఎందుకా టీడీపీ శాసనసభ్యులు అంత అసహనంగా ఉన్నారు? వాళ్లకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఉమ్మడి విశాఖజిల్లాలో కూటమి రాజకీయం వేడెక్కుతోంది. వ్యవస్ధ, వైఫల్యాలపై ప్రతిపక్షం కంటే ఎక్కువగా అధికార పార్టీ నాయకులు గళమెత్తడం చర్చనీయాంశమవుతోంది. పైగా… అసంత్రుప్తి స్వరం వినిపిస్తున్న వాళ్ళంతా సీనియర్సే కావడంతో..…