విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డకునేందుకు ప్రత్యక్ష ఆందోళనలు మొదలయ్యాయి. నిత్యం కార్మికులు, ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. గత శనివారం ఉన్నట్టుండి 4200 మంది ఒప్పంద కార్మికుల తొలగింపుపై కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఉదయాన్నే ప్లాంట్ వద్దకు కుటుంబ సభ్యులతో సహ చేరుకున్న కార్మికులు ఈడీ ఆఫీసును ముట్టడించారు. కొద్దిసేపు ఆ ప్రాంతం నిరసనలతో, నినాదాలతో దద్దరిల్లి పోయింది.