అమెరికాలో భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందిన వారిపై వరుసగా దాడులు జరగడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. వీధి గొడవలో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త మృతి చెందారు. ఈ ఘటన ఫిబ్రవరి 2న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు వెల్లడించిన వివరాల ఇలా ఉన్నాయి.…