చలికాలం కేవలం ఆహ్లాదాన్ని మాత్రమే కాదు, ఆరోగ్య సమస్యలను కూడా వెంటపెట్టుకొస్తుంది. చల్లటి గాలుల ప్రభావంతో వైరల్ వ్యాధులు వేగంగా విజృంభిస్తుంటాయి. జలుబు, దగ్గు, జ్వరం నుంచి మొదలై శ్వాసకోశ ఇబ్బందుల వరకు ఎన్నో సమస్యలు మనల్ని వేధిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. అయితే చలికాలంలో ప్రతి ఒక్కరికి చలి వేయడం కామన్ కానీ.. పక్కన ఉన్న వారందరికీ మామూలుగానే ఉన్నా, మీకు మాత్రమే వణుకు పుట్టినంత…