విధి వక్రీకరించడంతో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సీఐ అనంతలోకాలకు పయనమయ్యాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పట్టణంలోని త్రీటౌన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వరరావు విధులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి బయలు దేరారు. అయితే ఎండాడ వద్ద గల జాతీయ రహదారిపై 3.40 గంటలకు గుర్తుతెలియని వాహనం వచ్చి సీఐ ఉన్న పోలీసు వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సీఐ అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐతో పాటు ఉన్న కానిస్టేబుల్ సంతోష్ కు…