ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య, నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి రాసిన ‘మనసులోనే నిలిచి పోకె మైమరపుల మధురిమ / పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా / ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం / అన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం’ అంటూ సాగే…