‘వరుడు కావలెను’ నుంచి నాగ శౌర్య , రీతువర్మ ప్రేమగీతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య, నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి రాసిన ‘మనసులోనే నిలిచి పోకె మైమరపుల మధురిమ / పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా / ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం / అన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం’ అంటూ సాగే గీతాన్ని బుధవారం విడుదల చేశారు. విశాల్ చంద్రశేఖర్ ఈ పాటకు బాణీ సమకూర్చగా, చిన్మయి పాడారు. చిత్ర నాయకా నాయికలు మధ్య ప్రేమకు తెర రూపంగా ఈ గీతం కనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, స్వరం ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. వీటికి తోడు నాగశౌర్య, రీతువర్మ అభినయం కట్టిపడేస్తుంది. శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. నాయిక మనోభావాలకు అద్దంపడుతుందీ గీతం.
ఈ సందర్భంగా విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ”ప్రఖ్యాత రచయత సీతారామశాస్త్రి గారు సాహిత్యం అందించిన ఈ గీతానికి స్వరాలు సమకూర్చటం గౌరవంగా భావిస్తున్నాను. ఇది నా మనసును ఎంతగానో హత్తుకున్న పాట. చిన్మయి గారు ఆలపించిన ఈ గీతం మీకు కూడా నచ్చుతుంది. ప్రేక్షకులకు, సంగీత ప్రియులకు చాలాకాలంపాటు గుర్తుండిపోయే పాటగా వారి హదయాలలో నిలిచి పోతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న ‘వరుడు కావలెను’ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, నటీనటుల అభినయం చిత్ర కథానుగుణంగా సాగి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయన్న నమ్మకాన్ని చిత్ర దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నదియా, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, ‘రంగస్థలం’ మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
Also Read


తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!