వైవీ సుబ్బారెడ్డి రాకతో కలిగే ప్రయోజనాలపై చర్చ.ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్ వే విశాఖపట్నం. ప్రధాన రాజకీయపార్టీలకు ఆయువుపట్టు. ఇక్కడ ఫలితాలు పార్టీల పటిష్టత, భవిష్యత్‌ను నిర్ధేశిస్తాయి. అందుకే అందరి దృష్టీ ఎప్పుడూ విశాఖపై ఉంటుంది. వచ్చే రెండేళ్లూ ఎన్నికల సీజన్ కావడంతో ఈ ఫోకస్ మరింత పెరిగింది. ఈ క్రమంలో వైసీపీ సంస్థాగతంగా కీలకమైన మార్పులు చేసింది. ఉమ్మడి విశాఖజిల్లా సమన్వయకర్త బాధ్యతలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భుజాలపై పెట్టింది అధికార పార్టీ. కొత్త బాస్‌రాకతో…