GVL Narasimha Rao: విశాఖ భూముల విషయంలో ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై వైసీపీ నుంచి సంతృప్తికర సమాధానం రావటం లేదని జీవీఎల్ అసహనం వ్యక్తం చేశారు. సామాన్యుడికి న్యాయం జరగకుండా సంపన్నులకు న్యాయం చేసేలా చేస్తున్నారని మండిపడ్డారు. జీవీఎల్ ఎవరు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అంటున్నారని.. ఇదే అమర్నాథ్ గతంలో ఈ అంశంపై సీబీఐ విచారణ…