AP Crime: విశాఖపట్నంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.. మృతుడు సాయి తేజ.. ఎంవీపీలోని సమత కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.. ఈ రోజు ఉదయం విద్యార్థి సాయి తేజ ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు బంధువులు చెబుతున్నారు.. విద్యార్థి సాయి తేజ మృతికి కాలేజీ లెక్చరర్ లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.. గత కొద్దిరోజుల నుంచి వేధింపులు ఎక్కువ…
Rice Pulling: విశాఖ నగరంలో భారీ మోసం వెలుగు చూసింది. ‘రైస్ పుల్లింగ్’ (Rice Pulling) పేరుతో కేటుగాళ్లు హైదరాబాద్కు చెందిన ఓ మహిళా డాక్టర్ను బురిడీ కొట్టించి ఏకంగా రూ.1.7 కోట్లు వసూలు చేశారు. రైస్ పుల్లింగ్ ముఠా తనను నమ్మించి మోసం చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. ఆమె దఫదఫాలుగా ఆన్లైన్లో, నగదు రూపంలో పలుమార్లు డబ్బు చెల్లించినట్లు తెలిపింది. ముఠా సభ్యులు అరకు ప్రాంతానికి చెందిన ఏదో ఒక లోహాన్ని రైస్ పుల్లింగ్ పేరుతో…
విశాఖ కలెక్టరేట్లో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్ వార్ బజారుకెక్కింది. డీఆర్వో భవానీ ప్రసాద్, ఆర్డీవో శ్రీలేఖ మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరాయి. ఇంట్లోకి కావాల్సిన నెలవారీ సరకుల కోసం డీఆర్వో భవానీ ప్రసాద్ ఇండెంట్లు పెడుతున్నారని కలెక్టర్కు ఆర్డీవో శ్రీలేఖ ఫిర్యాదు చేశారు. ఉప్పు, పప్పు, చింతపండు సహా ఆఖరికి బట్టలు ఆరే సుకునే క్లిప్పుల వరకు ఈ జాబితాలో ఉన్నాయని కోట్ చేశారు. ఇలా వేలకు వేలు తహాశీల్ధార్లపై ప్రతీ నెల ఒత్తిడి చేయడం…
Seediri Appalaraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 రోజులుగా అతలాకుతలం అయిపోతుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. ఓ పక్కా రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి.. మరో వైపు వైసీపీ హయాంలోని వచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు.. గూగుల్ డేటా సెంటర్ తో నకిలీ మద్యం, మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారు.
విశాఖ సిటీలో మహిళను నడిరోడ్డుపై హత్య చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఓ మహిళకు ఓ వ్యక్తికి మధ్య జరిగిన ఘర్షణ నేపధ్యంలో ఆమె చనిపోవడంతో పిల్లలు అనాధలుగా మిగిలారు. నిందితుడు జైలు పాలయ్యాడు. క్షణికావేశంలో చేసిన దాడిలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒక వివాహిత హత్యకు గురైంది. ఆమె నివాసానికి ఎదురు ఇంట్లో ఉండే వ్యక్తే పదునైన…
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఎట్టకేలకు జగన్ పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులు.. వైసీపీ ప్రతిపాదించిన మార్గంలో కాకుండా కొత్త రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు జగన్. అక్కడ నుంచి NAD జంక్షన్, పెందుర్తి కూడలి మీదుగా అనకాపల్లి, తాల్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు వెళ్లే…
Andhra Pradesh: పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించింది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ విశాఖలో ఏర్పాటు చేయనుంది. రూ.87,520 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన 11వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలియచేసింది.. విశాఖలోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని…
Vizag Road Accident: తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని మసులుకునే పిల్లలు కొందరైతే.. తమనకు ఏది కావాలన్నా మారం చేసి సాధించుకునేవారు మరికొందరు.. ఇంకో వైపు, తన పిల్లల కోసం ఎంత కష్టానైనా భరించి.. వాళ్లకు మెరుగై జీవితాన్ని అందించాలనే భావించే పేరెంట్స్ ఉన్నారు.. తమ జీవితంలో సాదాసీదాగా బతుకుతున్నాం.. మా పిల్లలు అయినా అన్ని చూడాలి అని తాపత్రయ పడే తల్లిదండ్రులు ఉన్నారు.. అయితే, దసరా రోజు 3 లక్షల రూపాయల అప్పు చేసి బైక్…