Cyclone Effect: విశాఖపట్నంపై భీకర గాలులు విరుచుకుపడుతున్నాయి.. వాయుగుండం ప్రభావంతో వీస్తున్న బలమైన ఈదురుగాలుతో చెట్లు కూకటివేళ్లతో సహా నేలకూలుతున్నాయి.. గాలుల ధాటికి చెట్లు ఓవైపు.. హోర్డింగ్‌లు ఇంకోవైపు పడిపోతున్నాయి.. ద్వారాకా నగర్లో భారీ చెట్టు కారుపై పడిపోయింది.. ఈదురుగాలుతో రోడ్లపై ద్విచక్ర వాహనాలు కూడా నడిపే పరిస్థితి లేకుండా పోయింది.. ఇక, విశాఖ సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది.. దీంతో, అధికారులు రంగంలోకి దిగారు.. ఈదురు గాలులతో బెంబేలెత్తుతున్నారు విశాఖ నగరవాసులు.. Read Also:…
Visakhapatnam: పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఉమ్మడి విశాఖ జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. విస్తృతమైన కనెక్టివిటీ, భౌగోళిక సానుకూలత, మానవ వనరుల లభ్యత మేజర్ అడ్వాంటేజ్. ఇప్పటికే ఉన్న ఇండస్ట్రీస్ ఒక ఎత్తైతే.. ఫార్మా, గార్మెంట్, పెట్రోలియం అనుబంధ రంగాల పెట్టుబడులు విస్తృతమైన తర్వాత ఆసక్తి ఎక్కువైంది. అచ్యుతాపురం, పరవాడలో ఫార్మా పెట్టుబడులు రాగా వందల సంఖ్యలో కంపెనీలు వెలిశాయి. భవిష్యత్తులో పెట్టుబడులకు విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కీలకమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ తరుణంలోనే…
సాధారణంగా పరీక్షలో ఫెయిల్ అయ్యాను అన్న భయంతోనో, జాబ్ రాలేదు అన్న దిగులుతోనో, లేదంటే బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ఉచ్చులో పడి యువత ఆత్మహత్యలు చేసుకోడం చూస్తుంటాం. కానీ ఈ ఘటన మాత్రం బాధ పడాలో, ఓదార్చాలో తెలియని పరిస్థితి. తల్లిదండ్రులు ఖరీదైన ఐ ఫోన్ కొనివ్వలేదని మనస్థాపానికి గురై జీవితాన్నే ఫణంగా పెట్టాడు. మూర్ఖంగా ప్రవర్తించి అత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. కేవలం ఓ ఐ ఫోన్ కోసం పాతికేళ్లు పెంచి పెద్ద చేసిన…
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు అయ్యింది.. దీనిపై కీలక ప్రకటన చేశారు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి.. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్ కు అవకాశం ఇచ్చామని తెలిపారు.. గరిష్టంగా 3 కంపెనీలు కలిసి జేవీగా టెండర్లు వేసుకునే అవకాశం ఉందన్నారు..
విశాఖలో ఇవాళ, రేపు ఈ-గవర్నెన్స్‌పై జాతీయ స్ధాయి సదస్సు నిర్వహిస్తోంది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు. విశాఖపట్నం డిక్లరేషన్ ఆన్ ఈ-గవర్నెన్స్ 2025ను ఈ సమావేశంలో ప్రకటించనుంది ఏపీ సర్కార్.
ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.. విశాఖపట్నంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెందుర్తి సుజాతానగర్ లో నివాసం ఉంటున్న మృతుడు సాయి మారుతి తండ్రి చంద్రశేఖర్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు.. అతని కుమారుడు సాయి మారుతి కెవిన్ కొంతకాలం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమలో పనిచేసి, ఇటీవలే ఇంటికి వచ్చాడు.
విశాఖపట్నం వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి మూడో స్థానంలోకి వచ్చాం... రియల్ టైమ్ గవర్నెన్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఒకప్పుడు జాబ్ వర్క్ కి పరిమితం అయ్యే ఐటీ కంపెనీలు, ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నాయి.. ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా భారతీయులు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించిన వారిలో ఉండడం మనకు…
ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ (Kolors Healthcare) సంస్థ విశాఖపట్నంలో తన నూతన బ్రాంచ్‌ను ప్రారంభించింది. రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను హీరోయిన్ సంయుక్త మీనన్ ఆవిష్కరించారు.