విశాఖను డ్రగ్స్ మత్తు ఆవరిస్తోంది. డ్రగ్స్ పెడ్లర్స్ స్టీల్ సిటీని సేఫ్ సిటీగా భావిస్తున్నట్టు అనిపిస్తోంది. విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై యువత తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్దులు, యువతనే టార్గెట్ చేసుకుని విశాఖ నుంచి విజయవాడ, ముంబైకి డ్రగ్స్ తరలిపోతున్నాయి. విశాఖకు చెందిన పోలీసులు పలువురు యువతను అరెస్ట్ చేశారు.
నగరంలోని ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు సంయుక్తంగా దాడి జరిపి భారీగా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక యువతిని, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హైదరాబాద్‌కు చెందిన గీత, మాలవ్వ, విశాఖకు చెందిన హేమంత్, రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీలుగా గుర్తించారు. వీరి వద్ద నుంచి టాబ్లెట్ల రూపంలో ఉన్న 18 పిల్స్, 2 ఎండిఎం పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.