ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పలు వీసాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూలను అమెరికా విదేశాంగ శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. నాన్ ఇమ్మిగ్రెంట్ వర్క్ వీసా హెచ్1బీతో పాటు హెచ్3, హెచ్4 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ రద్దు వర్తిస్తుందని తెలిపింది. వచ్చే ఏడాది 2022 వరకు వీటిని రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. దీనిపై స్థానిక పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతీయ కాన్సులేట్/ఎంబసీ అధికారులు తుది…