Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ లో ప్రాణాలతో బయటపడిన తేజ్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక ఆ యాక్సిడెంట్ తరువాత తేజ్ నటిస్తున్న చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.