అంతరిక్షంలోకి ప్రయాణించేవారి సంఖ్య గత కొంతకాలంగా పెరుగుతున్నది. అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఇటీవలే అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి ట్రయల్స్ ను నిర్వహించింది. ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించడంతో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని అంతరిక్ష ప్రయాణాలకు వర్జిన్ సంస్థ సిద్దమైంది. ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో కమర్షియల్ ఫ్లైట్లను నడపాలని నిర్ణయించింది. ఆసక్తిగల పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకొని వెళ్లాలని నిర్ణయించింది. ఈ ప్రయాణానికి సంబంధించిన ధరలను నిర్ణయించింది. Read: Andhra Pradesh: గుడ్ న్యూస్.. రేపటి…
వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌన ఇటీవలే విజయవంతంగా రోదసిలోకి వెళ్లివచ్చింది. కమర్షియల్‌గా రోదసి యాత్రను ప్రారంభించేందుకు వర్జిన్ గెలక్టిక్ సన్నాహాలు చేస్తున్నది. భూమి నుంచి సుమారు 88 కిలోమీటర్ల వరకు రోదసిలో ప్రయాణం చేసి అక్కడ భారరహిత స్థితిని పొందిన అనుభూతిని పొందిన తరువాత తిరిగి భూమిమీదకు వస్తుంది. వర్జిన్ గెలక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతం కావడంతో, ఇప్పుడు అనేక మంది ఈ యాత్రను చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇండియాలోని కేరళకు చెందిన పర్యాటకుడు సంతోష్ జార్జ్ కులంగర వర్జిన్…
తెలిసింది గోరంత… తెలయంది కొండంత.. అంతకంటే ఇంకా ఎక్కవే… అంతరిక్షం గురించి తెలుసుకోవాలని, అంతరిక్షంలో ప్రయాణం చేయాలని అందరికీ ఉంటుంది. రష్యా వ్యోమగామి యూరిగగారిన్ ఎప్పుడేతే అంతరిక్షంలోకి అడుగుపెట్టాడో అప్పటి నుంచి మరింత ఆసక్తి నెలకొన్నది. పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. స్పేస్ రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ఎంటరయ్యాక ఒక్కసారిగా పోటీ మొదలైంది. వర్జిన్ గెలక్టిక్, బ్లూఆరిజిన్, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు అంతరిక్ష పరిశోధన రంగంలో దూసుకెళ్తున్నాయి. వీరి పరిశోధన మొత్తం అంతరిక్ష యాత్ర చుట్టూనే జరుగుతున్నాయి.…
ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన, కోరిక ఉంటుంది. పెళ్లి కొందరి కల అయితే, అందరికంటే భిన్నంగా హనీమూన్ జరుపుకోవాలని కొందరికి ఉంటుంది. అంతరిక్షంలో హనీమూన్ జరుపుకోవడం సాధ్యమేనా అంటే, ఒకప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందిందిం. చంద్రుని మీదకు వెళ్లి వస్తున్న తరుణంలో అంతరిక్షంలో హనీమూన్ ఎందుకు సాధ్యంకాదు. అంతరిక్షంపై ఉన్న మక్కువ, ఆసక్తితో థామస్ వైట్‌సైడ్స్, లోరెట్టాలు 2006లో వివాహం చేసుకున్నారు. అప్పటికే అంతరిక్ష ప్రయాణాలపై పరిశోధనలు చేస్తున్న వర్జిన్ ఎయిర్‌లైన్స్ సంస్థకు…