తాజాగా హర్ష సాయిపై కేసు విషయంతో వార్తల్లో నిలిచిన మిత్రా శర్మ, గతంలో నటిగా, నిర్మాతగా వ్యవహరించిన ‘వర్జిన్ బాయ్స్’ సినిమాతో మరోసారి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా కాలం క్రితం పూర్తయిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ సమ్మర్ సీజన్‌లో ప్రేక్షకులకు హాస్య రసాన్ని పంచేందుకు రొమాంటిక్ కామెడీ జోనర్‌లో రూపొందిన ‘వర్జిన్ బాయ్స్’ సినిమా రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్‌పై రాజా దరపునేని నిర్మాణంలో, దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కింది. గీతానంద్, మిత్రా శర్మ…